Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi wishes Karnataka new CM Siddaramaiah
Advertisement
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
  • ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారోత్సవం
  • సిద్ధరామయ్య, డీకే తమ పదవీకాలంలో విజయవంతం కావాలని మోదీ ఆకాంక్ష
Advertisement
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సిద్ధరామయ్య కర్ణాటక సీఎం పీఠం అధిష్ఠించడం ఇది రెండోసారి. 

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలతో జయభేరి మోగించగా, తీవ్ర చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా, రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, నేడు సిద్ధరామయ్య పదవీ ప్రమాణం చేశారు. 

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ తెలిపారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement
Narendra Modi
Siddaramaiah
DK Shivakumar
Karnataka
Congress
BJP

More Telugu News